ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (17:05 IST)

లండన్‌లో బిజీ బిజీగా నయనతార.. బిల్లా 2 డైరక్టర్‌తో ఏం చేస్తుందో తెలుసా?

కొరియోగ్రాఫర్‌తో ప్రేమాయణానికి ఎప్పుడు చెక్ పెట్టిందో అప్పటి నుంచి నయనతార ఫుల్‌బిజీగా వుంది. తెలుగు సినిమా మాట పక్కనబెడితే, తమిళంలో ఈమెకి చేతినిండా ఆఫర్స్ వున్నాయి. నయనతార తాజాగా 'కొలైవుదిర్ కాలమ్' సి

కొరియోగ్రాఫర్‌తో ప్రేమాయణానికి ఎప్పుడు చెక్ పెట్టిందో అప్పటి నుంచి నయనతార ఫుల్‌బిజీగా వుంది. తెలుగు సినిమా మాట పక్కనబెడితే, తమిళంలో ఈమెకి చేతినిండా ఆఫర్స్ వున్నాయి. నయనతార తాజాగా 'కొలైవుదిర్ కాలమ్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఉమెన్ సెంట్రిక్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుగుతోంది. 
 
లండన్ షూటింగ్ పార్టుతో ఈ సినిమా షెడ్యూల్ పూర్తవుతుంది. లండన్‌లో చిత్రీకరించే సీన్స్ సినిమాకు హైలైట్ అవుతాయని సినీ యూనిట్ చెప్తోంది. నయన రోల్ అందరినీ ఆకట్టుకునేలా వుంటుందని.. ఉన్నత విలువలతో ఈ సినిమా తెరకెక్కుతోందని సినీ మేకర్స్ వెల్లడిస్తున్నారు. 
 
అన్నట్లు.. ఈ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్‌రాజా నిర్మాతగా మారాడు. బిల్లా 2 సినిమా చేసిన చక్రీ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. అన్నీ పనులు పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.