గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (12:52 IST)

"రిపబ్లిక్" మూవీకి సెగ : కొల్లేరు గ్రామ సంఘ నేతల ఆందోళన

హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'రిపబ్లిక్‌'. ఈ చిత్రంలో కొల్లేరు ప్రజల జీవనశైలిని దెబ్బతీసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని.. వాటిని తొలగించాలని కొల్లేరు గ్రామాల సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. 
 
ఈ సన్నివేశాలకు నిరసనగా ఏలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 
 
కాగా, దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబరు ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. అయితే, చిత్రం విడుదలైన నాలుగైదు రోజుల తర్వాత కొల్లేరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.