15 రోజుల క్రితం గుండెపోటు, డబ్బుల్లేక చిన్న ఆస్పత్రిలో తమిళ కమెడియన్, కన్నుమూత

Vadivel Balaji
ఐవీఆర్| Last Updated: గురువారం, 10 సెప్టెంబరు 2020 (20:43 IST)
తమిళ సినిమాల్లో ప్రముఖ కమెడియన్ వడివేలుని అలవోకగా అనుసరించి కడుపుబ్బ నవ్వించే కోలీవుడ్ యువ నటుడు వడివేల్ బాలాజీ కన్నుమూశారు. గత పదిహేను రోజులుగా గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. ఆయన వయసు 42.

వడివేల్‌ బాలాజీని తొలుత పెద్ద ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆ తర్వాత హాస్పటల్ ఫీజు కట్టలేక చిన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. గత 15 రోజులుగా ఆయన చెన్నైలోని ఒమందురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఐతే గురువారం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. అతడిని కాపాడే ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాయి.

ప్రఖ్యాత కోలీవుడ్ హాస్యనటుడు వడివేలును అనుకరించిన తరువాత వడివేల్ బాలాజీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. విజయ్ టీవీలో కలక్కపోవాదు యారు అనే టీవీ ప్రోగ్రామ్‌తో అడుగుపెట్టి ఆ తర్వాత విజయవంతంగా ముందుకు దూసుకుపోయాడు. వడివేల్ బాలాజీ తొలిసారిగా కోలమావు కోకిల చిత్రంలో నయనతారతో కలిసి నటించారు. టీవీ నుండి పెద్ద తెరపైకి విజయవంతంగా వచ్చిన కొద్దిమంది తమిళ నటులలో ఆయన ఒకరు.దీనిపై మరింత చదవండి :