బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (21:04 IST)

ఒకే ఫ్రేములో ఆ జంటలు.. సోషల్ మీడియాలో వైరల్

Nayana_vignesh
లేడి సూపర్ స్టార్ నయనతార వివాహంపైనే ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో నయన ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విఘ్నేశ్‌ శివన్‌కు కోలీవుడ్‌లో చాలామంది స్నేహితులున్నారు. 
 
స్టార్ హీరో విజయ్ సేతుపతి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వరకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తమిళ ప్రేక్షకులకు బ్లాక్ బాస్టర్ చిత్రాలనందించిన దర్శకుడు ఆట్లీ. ఈ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్-నయన్‌కు మంచి స్నేహితుడు. గతేడాది విఘ్నేశ్ శివన్ బర్త్ డే సందర్భంగా ఆట్లీ-ప్రియా దంపతులు విఘ్నేశ్‌-నయన్ ఒక్కచోట కలిసి సందడి చేశారు.
 
మ్యాచింగ్ బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో ఈ ఇద్దరు కపుల్స్ ఒకే ఫ్రేములో ఉన్నపుడు క్లిక్ మనిపించిన త్రోబ్యాక్ స్టిల్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సమంత, నయనతార కీలక పాత్రల్లో ఓ చిత్రాన్ని విఘ్నేశ్ శివన్ రూపొందిస్తున్నారు.