బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 మార్చి 2024 (12:55 IST)

రెండోపెళ్లి చేసుకుంటానన్న నిహారిక, తట్టుకోలేకపోతున్న మాజీ భర్త ఏం చేసాడంటే?

Konidela Niharika
కర్టెసి-ట్విట్టర్
తనకు పిల్లలు అంటే ఎంతో ఇష్టమనీ, ఐతే పిల్లల్ని కనాలనంటే పెళ్లి చేసుకోవడం తప్పనిసరి అనీ, అందుకోసం రెండో పెళ్లి తప్పకుండా చేసుకుంటానని నిహారిక కొణిదెల ఈమధ్య చెప్పారు. ఐతే తను రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో చెప్పలేనని కూడా వెల్లడించారు. నిహారిక ఆ మాటలు చెప్పడంపై చర్చనీయాంశంగా మారింది.
 
ఇదిలావుంటే ఆమె మాజీభర్త జొన్నలగడ్డ చైతన్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ సారాంశం అంతా నిశ్శబ్దంపైనే సాగింది. నిశ్శబ్దంపై జొన్నలగడ్డ రాసిన కొటేషన్స్ చూస్తుంటే... నిహారిక తను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడని అర్థమవుతుందని కొందరు నెటిజన్లు చెప్పుకుంటున్నారు. మరి నిజం ఏమిటో జొన్నలగడ్డకే తెలియాలి.