శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శనివారం, 20 మే 2017 (10:59 IST)

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో మరో మూవీ...

ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్

ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించ‌నున్నారు. ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'జ‌న‌తా గ్యారేజ్' అందుకున్న విజ‌యాన్ని ఇంకా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ర్చిపోలేదు. అంత‌లోనే ఈ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా షురూ కానుండ‌టం సినీ ప్రియుల‌కు, అభిమానుల‌కు పండుగే. 
 
యువ‌సుధ‌ ఆర్ట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న మిక్క‌లినేని సుధాక‌ర్ మాట్లాడుతూ.. 'ఎన్నెన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ అనుభవంతో నిర్మాతగా మారుతున్నాను. నా చిన్న నాటి స్నేహితుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నా తొలి చిత్రాన్ని నిర్మించ‌డం, ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా నటించడం ఆనందంగా ఉంది. వారిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'జ‌న‌తా గ్యారేజ్'ను ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆ చిత్రాన్ని మించేలా, ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీగా, మైలురాయిలా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాం. మిగిలిన అన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం అని చెప్పుకొచ్చారు.