బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

మంచి మనస్తత్వంతో చూస్తే ప్రపంచం అందంగా కనిపిస్తుంది.. కృతి సనన్ తల్లి

adipurush
మంచి మనస్తత్వంతో చూసే వారికి ఈ ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుందని బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ తల్లి గీత సనన్ అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇపుడు ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షిస్తుంది. 
 
కృతి సనన్ హీరోయిన్‌గా, ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆదిపురుష్ చిత్రం అనేక విమర్శలను ఎదుర్కొంటుంది. ఇందులో జానకిగా కృతి సనన్ నటించారు. ఈ నేపథ్యంలో కృతి సనన్‌ తల్లి గీత సనన్‌ పెట్టిన పోస్ట్‌ నెటిజన్లను ఆకర్షిస్తుంది. 
 
రామాయణంలోని ఓ సన్నివేశాన్ని గురించి తెలిపిన ఆమె అందరి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని కోరింది. 'మంచి మనస్తత్వంతో చూస్తే ప్రపంచం మొత్తం అందంగా కనిపిస్తుంది. శబరి రాముడికి ఇచ్చిన పండ్లలో రాముడు ఆమె ప్రేమను, భక్తిని చూశాడు. అంతేకానీ ఆమె సగం తిన్నదని చూడలేదు. ఒక వ్యక్తిలోని తప్పులను చూడొద్దు. వారి భావోద్వేగాలను అర్థం చేసుకోండి' అని పోస్ట్‌ పెట్టింది. 
 
రామాయణం ఆధారంగా అత్యున్నత సాంకేతికతతో దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటించారు. సీతగా హీరోయిన్‌ కృతిసనన్‌ కనిపించారు. రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ తన నటనతో ఆకట్టుకుంటున్నాడు.