గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (20:28 IST)

మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోన్న లైకా ప్రొడక్షన్స్

L2E: Empuran
L2E: Empuran
మ‌ల‌యాళం సినిమా ఇండ‌స్ట్రీ అంటే కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ ముందుకు సాగిపోతుంది. కొన్నేళ్లుగా ఓ ప‌రిప‌క్వ‌త‌, గాఢ‌మైన సినిమాల‌ను చేయ‌టంలో వీరు త‌మదైన ప్ర‌త్యేక‌త‌ను చూపుతున్నారు. మెథ‌డ్ యాక్టింగ్‌తో ఎంద‌రో టాలెంటెడ్ న‌టీన‌టుల‌ను ప్రపంచ వ్యాప్తంగా అంద‌రినీ అల‌రిస్తున్నారు. 
 
మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీ నుంచి అటు మాస్‌, ఇటు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ కంప్లీట్ యాక్ట‌ర్ ఇమేజ్‌ను సంపాదించుకున్న న‌టుడు మోహ‌న్ లాల్‌. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నాలుగు ద‌శాబ్దాల పైగా అనుభ‌వం, 350 సినిమాలు ఆయ‌న్ని తిరుగులేని క‌థానాయ‌కుడిగా నిల‌బెట్టాయి. ఆయ‌న న‌ట‌న‌తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసి ఇప్ప‌టికీ హ‌య్య‌స్ట్ పెయిడ్ యాక్ట‌ర్‌గా అక్క‌డ కొన‌సాగుతున్నారు. 
 
అలాగే మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన మ‌రో ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న మ‌ల‌యాళం స‌హా ప‌లు భాష‌ల్లో ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి అల‌రించారు. 2019లో ఈయ‌న డైరెక్ట్ చేసిన సినిమా లూసిఫ‌ర్ ఎంత‌టి ఘ‌న విజయాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దీనికి కొన‌సాగింపుగా ఇప్పుడు ‘ఎల్2ఇ: ఎంపురాన్ (L2E: Empuraan)’ చిత్రం మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నుంది. ఆంటోని పెరంబ‌వూర్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతోన్న ఆశీర్వాద్ సినిమాస్  బ్యాన‌ర్‌తో పాటు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ కల‌యిక‌లో, జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్ నేతృత్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది. 
 
సంస్కృతి, సాంప్ర‌దాయ‌ల‌కు విలువ‌నిచ్చే కేర‌ళలో సినీ నిర్మాణ రంగంలోకి లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అడుగు పెడుతున్న సంద‌ర్భంగా కేర‌ళ ప్రాంతం ఆయ‌న‌కు హృద‌య‌పూర్వ‌కంగా స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు ‘ఎల్2ఇ: ఎంపురాన్ (L2E: Empuraan)’  నిర్మాణ భాగ‌స్వామి ఆశ్వీర్వాద్ సినిమాస్ తెలియ‌జేసింది. ‘లైకా ప్రొడక్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్‌ వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టానికి ఎప్పుడూ ఆస‌క్తిని చూపుతుంటారు. సినిమాల‌పై ఆయ‌నుకున్న ప్యాష‌న్‌ను ఇది తెలియ‌జేస్తుంది. లైకా ప్రొడక్షన్స్ మలయాళంలో సినిమాల తీయటానికి సిద్ధమవటం అనేది చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహ‌దం చేయ‌ట‌మే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల‌కు ఎన్నో కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను చూసే అవ‌కాశాల‌ను క‌లిగించొచ్చు. ఎన్నో గొప్ప చిత్రాల‌ను అందిస్తూ చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి మార్గ‌నిర్దేశం చేస్తుంది లైకా సంస్థ‌. అదే పంథాను ఇక్క‌డ కూడా కొన‌సాగిస్తార‌ని న‌మ్ముతున్నాం. మా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్రాజెక్ట్‌లో మాతో చేతులు క‌లిపి నందుకు వారికి మా ధ‌న్య‌వాదాలు’ అన్నారు.