గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (19:58 IST)

స్టైల్ 2 ప్లాన్లో లారెన్స్... హీరోలు ఎవ‌రో తెలుసా?

లారెన్స్ స్టైల్ సినిమాని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌భుదేవా, లారెన్స్ క‌లిసి న‌టించి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు. ఇందులో లారెన్స్ డ్యాన్స్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే... కాంచ‌న 3 సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో లారెన్స్‌ని క‌లిసిన శ్రీధర్ స్టైల్ 2 చేద్దాం. క‌థ రెడీ చేయ‌మ‌ని చెప్పార‌ట‌. 
 
ఈ విష‌యాన్ని లారెన్స్ ఈ వేడుక‌లో చెబుతూ... లగడపాటి శ్రీధర్‌ గారితో స్టైల్‌ సినిమా చేశాను. ఇప్పుడు ఆయనే స్టైల్‌ 2 చేద్దామంటున్నారు. తప్పకుండా చేస్తాను. డ్యాన్స్‌ సినిమా చేయాలంటే మంచి డ్యాన్సర్‌ కావాలి. ఇక్కడ బాగా డ్యాన్స్‌ చేసే వాళ్లలో బన్ని, చరణ్‌, తారక్‌ బాగా చేస్తారు. 
 
అన్నయ్య గురించి ఈ సందర్భంలో చెప్పలేదని అనుకోవద్దు.. ఎందుకంటే ఆయనే అన్నింటికీ బాస్‌. కాబట్టి స్టైల్‌ 2 చేసేటప్పుడు పెద్ద హీరోలతో ప్లాన్‌ చేసి తీయాలి. ఖ‌చ్చితంగా చేస్తాన‌ని చెప్పారు. మ‌రి...బ‌న్ని, చ‌ర‌ణ్, తార‌క్ వీరిలో ఎవరెవ‌రితో స్టైల్ 2 ఉంటుందో చూడాలి.