శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:59 IST)

ఉదయ్ కిరణ్ మృతికి భార్యనే కారణమా? అయినా ఆ పనులు చేస్తుందిగా

టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ మరణానికి ఆర్థిక కారణాలే అని కొన్నేళ్లు వార్తలొచ్చాయి.. కానీ అది కారణం కాదంటూ ఆ మధ్య ఉదయ్ కిరణ్ అక్క సంచలన వ్యాఖ్యలు చేసింది. కుటుంబ కలహాలతోనే ఈయన చనిపోయాడనే అర్థం వచ్చేలా మాట్లాడింది. మస్కట్‌లో ఉండే ఈమె.. తన తమ్ముడు కోటీశ్వరుడు అని.. వాడికి డబ్బుల్లేక చచ్చిపోవాల్సిన ఖర్మ పట్టలేదని చెప్పింది. 
 
భార్య విషితపైనే తమకు అనుమానాలున్నాయని సంచలన కామెంట్స్ చేసింది. అయితే వీటిపై ఉదయ్ కిరణ్ భార్య విషిత స్పందించింది లేదు. ఉదయ్ అంత్యక్రియలు అయిపోయి.. 11 రోజులు పూర్తైపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ రెండు కుటుంబాలు కలుసుకున్నది కూడా లేదని ఉదయ్ అక్క చెప్పింది. 
 
ఇంతటి సంచలన కామెంట్స్ చేసిన తర్వాత కూడా విషిత బయటికి రాకపోతే ఉదయ్ కిరణ్ అక్క చెప్పిందే నిజమవుతుందని అంతా అంటున్నారు. అసలు ఇప్పుడు ఉదయ్ భార్య విషిత ఏం చేస్తుంది..? ఎక్కడుంది అనేది చాలా మందికి ఆసక్తికరంగా మారిన ప్రశ్న.
 
నిజానికి ఉదయ్ కిరణ్‌ను పెళ్లి చేసుకోక ముందు నుంచి కూడా ఈమె ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయిగా పని చేస్తుంది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. అయితే తాను స్టార్ హీరో అనే భ్రమలో ఉండిపోయి.. ముందు నుంచి పట్టించుకున్న ఇండస్ట్రీనే ఇప్పుడు దూరం పెట్టిందనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఉదయ్ కిరణ్‌ను బాగు చేయడానికి చాలా ప్రయత్నించింది విషిత.
 
ఇదే విషయం ఆమె సన్నిహితులు కూడా చెప్తుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఉదయ్ మామూలు మనిషి కాలేకపోయాడు. ఓ సమయంలో అతడికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించిందని.. తెలుగు కాకపోతే తమిళ ఇండస్ట్రీలో చూసుకుందాం అని అక్కడ 25 వేలు పెట్టి ఓ ఫ్లాట్ కూడా తీసుకుందని చెప్తుంటారు తెలిసిన వాళ్లు. మూడు నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చిందంటారు ఉదయ్, విషితను బాగా పరిశీలించిన వాళ్లు. అయితే ఎంత చేసినా కూడా చివరికి ఓ రోజు విషిత లేని సమయం చూసి ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
 
అతడు చనిపోయిన తర్వాత కూడా విషిత మరో పెళ్లి చేసుకోకుండా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ వీకెండ్స్‌లో అనాథాశ్రమాలకు, వృధ్ధాశ్రామాలకు విరాళం ఇస్తుందని తెలుస్తుంది. ఇప్పటికీ చనిపోయిన భర్తను గుర్తు చేసుకుని తన జీవితం కొనసాగిస్తుందని విషిత సన్నిహితులు చెప్తున్న మాట. ఏదేమైనా కూడా ఉదయ్ కిరణ్ భార్య గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు.