లేచింది మహిళా లోకం సెట్లో శ్రద్దాదాస్ విన్యాసాలు వైరల్
Shraddadas, Lakshmi Manchu, Ananya Nagalla
విప్లవం మొదలైంది అంటూ కాప్షన్‌తో ఓ సినిమా రాబోతోంది. నటి శ్రద్ధా దాస్ ఈ సినిమాలో నటిస్తోంది. ఆమెతోపాటు లక్ష్మీ మంచు, అనన్య నాగళ్ల, సుప్రీత, హరి తేజ కాంబినేషన్‌లో `లేచింది మహిళా లోకం` షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ శివార్లో ఓ భవంతిలో షూటింగ్ జరుగుతుండగా షూట్ గ్యాప్‌లో ఫోన్‌లో నెట్‌వర్క్ కోసం అందరూ ఒకరూమ్‌లోకి వచ్చి నెట్‌వర్క్‌ను వెతుకుతున్నారు. ఈ సందర్భంగా శ్రద్దాదాస్ లేచింది మహిళాలోకం నిద్ర లేచింది.. అనే గంటసాల పాటను పెట్టి వీడియో పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సరదాగా చేసిన ఈ వీడియో మొబైల్ నెట్‌వర్క్‌ను కనుగొనడంలో వారి కష్టాన్ని తెలియజేస్తూ చెప్పింది. ఈ చిత్రానికి అర్జున్, కార్తిక్ దర్శకత్వం వహింస్తున్నారు. చిత్రానికి శృతిరంజని సంగీత దర్శకురాలుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని హైమా రాజశేఖర్, శ్వేతామహి, నిరోషా నవీన్ నిర్మిస్తున్నారు.