శుక్రవారం, 13 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : బుధవారం, 11 మే 2016 (18:11 IST)

సందేశాత్మకమైన ''లైఫ్‌కి ఫ్లాట్ ఫామ్ టీనేజ్ '': 13న రిలీజ్!

జై చిరంజీవ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొండపల్లి పర్వతాలు సమర్పణలో తన్నీరు చిరంజీవి దర్శకత్వంలో సకినాన భూ లక్ష్మి నిర్మించిన చిత్రం ''లైఫ్ కి ఫ్లాట్ ఫాం టీనేజ్''. ఉమ, రాఘవ, ప్రకాష్, శశాంక్, రాహుల్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 13న రిలీజ్ చేయనుంది. 
 
ఈ సినిమా దర్శకులు తన్నీరు చిరంజీవి మాట్లాడుతూ ''సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించామని, తప్పకుండా యూత్‌కి బాగా నచ్చే చిత్రమని టీనేజ్‌లో తెలిసీ తెలియక చేసే పనుల వల్ల అనర్దాలు జరుగుతాయని, అదే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ టీనేజ్ జీవితానికి సరైన ఫ్లాట్ ఫాం అవుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందించామని ఈనెల 13న సినిమాని రిలీజ్ చేస్తున్నామని'' తెలిపారు.
 
నిర్మాత భూలక్ష్మి మాట్లాడుతూ ''యూత్‌కి సందేశం అందించే ఈ చిత్రంలో యువతరానికి కావలసిన అన్ని అంశాలు ఉన్నాయని తప్పకుండా మా సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.