శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 8 జూన్ 2020 (18:37 IST)

అదృష్టదేవతలా మారిన తాప్సి

తెలుగు, తమిళంలోను అడపాదడపా కొన్ని సినిమాలు చేశారు తాప్సి. పెద్దగా హిట్లు లేకపోయినా తాప్సికి మంచి పేరే ఉంది. అయితే బాలీవుడ్ వైపు వెళ్ళిన తరువాత  తాప్సి వెనుతిరిగి చూడనేలేదు. భారీ విజయాలతో హిట్ సినిమాలతో దూసుకుపోతోంది. బాలీవుడ్లో అదృష్టదేవతలా పేరు తెచ్చుకుంది తాప్సి.
 
ముఖ్యంగా తాప్సి నటించిన గేమ్ ఓవర్, సాండ్ కీ ఆంఖ్, మిషన్ మంగళ్ సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఒకటి రెండు కాదు 352 కోట్ల రూపాయల రికార్డ్ కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాదు మిషన్ మంగళ్ సినిమా అయితే ఏకంగా 202 కోట్ల రూపాయలను రాబట్టింది.
 
తన సినిమాలు ఈ స్థాయిలో విజయం సాధిస్తాయని తను అస్సలు అనుకోవడం లేదంటోంది తాప్సి. ఇలాంటి విజయాన్ని తలుచుకుని ఆమె తెగ సంతోషపడుతోంది. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాను.. ఈ సంతోషాన్ని ఆస్వాదిస్తున్నానంటోంది తాప్సి. మళ్ళీ ఇలాంటి సినిమాలు చేయాలని ఎంతో ఆతృతగా ఉన్నానని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పోస్టులు కూడా చేస్తోంది.