శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 నవంబరు 2024 (15:26 IST)

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో M4M హిందీ ట్రైలర్ విడుదల

M4M Hindi Trailer poster, Joe Sharma
M4M Hindi Trailer poster, Joe Sharma
మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన M4M (Motive For Murder)మూవీ హిందీ ట్రైలర్ ప్రతిష్టాత్మక గోవా ఇంట‌ర్నెష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ (Goa IFFI)లో విడుద‌ల కానుంది. ఈ నెల 23న సాయంత్రం 7 గంట‌ల‌కు గోవా ఇంట‌ర్నెష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో IMPPA ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, దేశ విదేశీయ సినీప్రముఖుల సమక్షంలో హిందీ ట్రైలర్ లాంచ్ చేయబోతోంది చిత్ర‌యూనిట్.
 
ఈ సందర్భంగా ఈ మూవీ ద‌ర్శ‌క‌నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల మీడియాతో మాట్లాడుతూ.. M4M సబ్జెక్ట్ యూనివర్సల్ అని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు మా M4M మూవీని చూసి థ్రిల్ అవుతారని చెప్పారు. మోటివ్ ఫర్ మర్డర్ తెలిసినప్పుడు మైండ్స్ బ్లో అవుతాయని, అనూహ్యమైన సినిమాటిక్ ఎక్సపీరియన్స్ నేను మీ అందరికీ అందించబోతున్నాను అంటూ తెలిపారు. త్వ‌ర‌లోనే ఐదు భాషల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు.
 
తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో తెర‌కెక్కింది ఈ సస్పెన్స్ థ్రిల్లర్. మునుపెన్నడూ ఎరుగని సైకొని ప్రేక్షకులు చూడబోతున్నారని, మర్డర్ మిస్టరీ ఒక సెన్సేషన్ కాబోతుందని ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒడిశా సూపర్ స్టార్ సంబీట్ ఆచార్య, అమెరికన్ హీరోయిన్  జో శర్మ లకు ప్యాన్ ఇండియా స్కేల్ లో కొత్త అధ్యాయం మొదలవుతుందని చెబుతున్నారు.
 
తారాగణం: జో శర్మ (ప్రధాన నటి) (USA),  సంబీత్ ఆచార్య (ప్రధాన నటుడు), శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ, MRC వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్, కథ: మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడబాల, జో శర్మ