శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (19:39 IST)

శిబి సత్యరాజ్ నటిస్తున్న 'మాయోన్' టీజర్ విడుదల

Sibi Sathyaraj
సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న సినిమా 'మాయోన్'. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదల అయింది. కిషోర్ ఎన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ లో అరుణ్ మొళి మాణికం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆయనే స్క్రీన్ ప్లే అందిస్తుండడం గమనార్హం. టీజర్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. రామ్ పాండ్యన్ - కొండల రావు ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూర్తిస్థాయి విజువల్ ట్రీట్ గా 'మాయోన్' టీజర్ అలరిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు దర్శక నిర్మాతలు.
 
నటీనటులు: శిబి సత్యరాజ్, తాన్య రవిచంద్రన్, రాధా రవి, కె.ఎస్.రవికుమార్, భగవతి పెరుమా, హరీష్ పేరడీ తదితరులు..
టెక్నికల్ టీం: దర్శకుడు: కిశోర్ ఎన్, నిర్మాత: అరుణ్ మొళి మాణికం, ప్రొడక్షన్: డబుల్ మీనింగ్ ప్రొడక్షన్, కెమెరాః రామ్ ప్రసాద్, ఎడిటర్: రామ్ పాండ్యన్ - కొండల రావు.