శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (10:51 IST)

మాయ చేస్తున్న 'మజిలీ' సాంగ్

అక్కినేని నాగ చైతన్య, ఆయన సతీమణి, హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం "మజిలీ". ఈ చిత్రం వచ్చే నెల ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా టీజర్ రిలీజైన దగ్గరి నుంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే మూడు సింగిల్స్‌ను రిలీజ్ చేశారు. మూడు అద్భుతంగా ఉన్నాయి. ఈ నిమాలోని 'మాయా మాయా' అనే వీడియో సాంగ్‌ టీజర్ ప్రోమోను రిలీజ్ చేశారు. 
 
నాగ చైతన్యను ఇంట్రడ్యూస్ చేస్తూ సాంగ్ అది. పిక్చరైజెషన్ చాలా చాలా బాగుంది. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే నాగచైతన్య రాత్రి కావొద్దని కోరుకోవడం.. ఫ్రెండ్స్‌తో కలిసి వానలో సైతం క్రికెట్ ఆడే సన్నివేశాలను సాంగ్‌లో చూపించారు. ఈ సాంగ్‌ను యువతను ఆకట్టుకునేలా చిత్రీకరించారు.