శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (17:17 IST)

మాధవన్, అనుష్క కాంబినేషన్ మళ్లీ వచ్చేస్తోంది..

మాధవన్, అనుష్క కాంబినేషన్‌లో రెండో సినిమా రానుంది. పన్నెండేళ్ల క్రితం మాధవన్, అనుష్క కలిసి రెండు అనే తమిళ సినిమాలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. ఇన్నాళ్లకి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళబోతుంది. దీనికి కోన సమర్పకుడు.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వచ్చే ఏడాది అమెరికాలో సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. 'వస్తాడు నా రాజు' ఫేం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. 
 
''భాగమతి'' తరువాత అనుష్క నుండి మరో సినిమా ప్రకటన రాలేదు. మధ్యలో దర్శకుడు గౌతమ్ మీనన్‌తో సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. కానీ దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. గౌతమ్ మీనన్ కూడా తన తమిళ సినిమాతో బిజీ అయిపోయాడు. దీంతో అనుష్క తదుపరి సినిమా మాధవన్‌తో ఖరారైపోయింది. అనుష్క పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ తెలిపారు.