ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 12 ఏప్రియల్ 2017 (07:09 IST)

చిత్ర ప్రమోషన్ల విషయంలో మన హీరోయిన్లే బెస్ట్.. ధనుష్‌కి చుక్కలు చూపిస్తున్న మల్లువుడ్ బ్యూటీ

నిర్మాతలకు సహకరించడంలో, సినిమా షూటింగ్ పూర్తయ్యాక చిత్ర ప్రమోషన్లలో పాలుపంచుకోవడంలో, అవకాశం ఇచ్చిన వారిపట్ల కృతజ్ఞత ప్రకటించడంలో తెలుగు హీరోయిన్లు ఎంత మంచివారంటే దక్షిణాది చిత్రసీమలో ఎవరూ వారికి సాటి రారని ఎప్పుడో రుజువైంది. దీనికి తాజా ఉదాహరణ అనుష్క

నిర్మాతలకు సహకరించడంలో, సినిమా షూటింగ్ పూర్తయ్యాక చిత్ర ప్రమోషన్లలో పాలుపంచుకోవడంలో, అవకాశం ఇచ్చిన వారిపట్ల కృతజ్ఞత ప్రకటించడంలో తెలుగు హీరోయిన్లు ఎంత మంచివారంటే దక్షిణాది చిత్రసీమలో ఎవరూ వారికి సాటి రారని ఎప్పుడో రుజువైంది. దీనికి తాజా ఉదాహరణ అనుష్క, తమన్నా. బాహుబలి సినిమా ప్రమోషన్‌ భారం తమదే అన్నంత గురుతర బాధ్యతను మీద వేసుకుని హైదరాబాద్, ముంబయ్, చెన్నయ్, కేరళ ఎక్కడ ప్రమోషన్ యాక్టవిటీస్ ఉన్నా చిత్ర యూనిట‌్‌తో మమేకమై వీరు మెలుగుతున్న తీరు చూసి బాహుబలి దర్శకుడు రాజమౌళి కరిగిపోతున్నారు.
 
కాని అదేసమయంలో కొలివుడ్‌లో అడుగుపెట్టిన మలయాళీ యువ హీరోయిన్ మడోనా. సెబాస్టియన్ తను తాజాగా నటించిన పవర్ పాండి చిత్ర దర్శకుడు ధనుష్‌కు చుక్కలు చూపిస్తోందని సమాచారం. రజనీకాంత్ అల్లుడుగా కంటే తమిళ హీరోగానే గుర్తింపు పొందిన ధనుష్ తొలిసారిగా మోగాఫోన్‌ పట్టి తెరకెక్కించిన చిత్రం పవర్‌పాండి. రాజ్‌కిరణ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో నటి మడోనా అతిథి పాత్రలో మెరవనుంది. అందుకుగాను ఆమె కోరిన పారితోషికాన్ని ముట్ట చెప్పారు.
 
చిత్రం ఈ నెల 14న తెరపైకి రానున్న నేపథ్యంలో చిత్ర ప్రచారంలో పాల్గొనాలని మడోనాకు ముందుగానే చిత్ర నిర్మాతలు షరతు విధించారట. అయితే ఇప్పుడు అందుకు ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదట. చిత్ర నిర్మాతల తరపున ఫోన్‌ చేయగా తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని టాక్‌. ఇంకా చెప్పాలంటే వాళ్లను తను అస్సలు లెక్క చేయడం లేదని సమాచారం. ఇలా పలుమార్లు చేసినా మడోనా స్పందించకపోవడంతో ధనుష్‌ వర్గం ఆమెకు ఘాటుగానే మెసేజ్‌ పంపారట.
 
దీంతో ఈ అమ్మడు ‘మైండ్‌ యువర్‌ వర్డ్స్‌’ అంటూ సింపుల్‌గా రిప్లై ఇచ్చిందట. కాగా మడోనా చ ర్యలకు ఆగ్రహంతో ఊగిపోతున్న ధనుష్‌ వర్గం ఆమెపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన తమిళ సినీ నిర్మాతల మండలి కార్యవర్గానికి తొలి ఫిర్యాదు నటి మడోనాదే కానుంది.
 
‘కాదలుం కడందుపోగుం’ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతైన మాలీవుడ్‌ అమ్మడు మడోనా సెబాస్టియన్‌. తొలి చిత్రంతో పాటు ఇటీవల తాను నటించిన ‘కవన్‌’ చిత్రం విజయం సాధించడంతో అమ్మడికి హెడ్‌వెయిట్‌ పెరిగినట్లుందని కోలీవుడ్‌ టాక్‌. ధనుష్‌ను పట్టించుకోకుండా నటి మడోనా ఆయనకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ మడోనా.. మజాకా..అనిపిస్తోందనే ప్రచారం ప్రస్తుతం నెటిజన్లకు ఫుల్‌మీల్స్‌గా మారింది.