గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 22 జనవరి 2017 (13:43 IST)

"నా బలం, నా జీవితంలో వెలుగు నువ్వే"...డియరెస్ట్ వైఫ్‌కు ప్రిన్స్ విషెస్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన సతీమణి నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భార్యపై తనకున్న ప్రేమను తెలియజేసేందుకు ట్విట్టర్ ఖాతాను ఎంచుకున్నాడు. నమ్రత ఫోటోను ట్వీట్ చేస్తూ, "నా బలం, నా జీవితంలో

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన సతీమణి నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భార్యపై తనకున్న ప్రేమను తెలియజేసేందుకు ట్విట్టర్ ఖాతాను ఎంచుకున్నాడు. నమ్రత ఫోటోను ట్వీట్ చేస్తూ, "నా బలం, నా జీవితంలో వెలుగు నువ్వే. హ్యాపీ బర్త్ డే టూ మై డియరెస్ట్ వైఫ్" అని ట్వీట్ చేశాడు. 
 
ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్, నమ్రతల జంట ఎంతో మంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచింది. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో పెట్టిన ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కొన్ని గంటల్లో వేలాది మంది ఈ ఫోటోను వీక్షించారు.