గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 17 మే 2016 (21:30 IST)

మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం'తో అదరగొడుతున్నాడు... సీడెడ్ రూ.10 కోట్లు, ఓవర్సీస్ రూ.13.2 కోట్లు

సెన్సార్ పూర్తిచేసుకున్న బ్రహ్మోత్సవం’ సినిమా క్లీన్ ’యు’ సర్టిఫికేట్ పొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వచ్చే రైల్వే స్టేషన్ సన్నివేశం, విశ్రాంతి సన్నివేశంతో పాటు సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలలో మహేష్ బాబు నటన అందరినీ ఆకట్టుకుంటుందని సమాచా

సెన్సార్ పూర్తిచేసుకున్న బ్రహ్మోత్సవం’ సినిమా క్లీన్ ’యు’ సర్టిఫికేట్ పొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వచ్చే రైల్వే స్టేషన్ సన్నివేశం, విశ్రాంతి సన్నివేశంతో పాటు సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలలో మహేష్ బాబు నటన అందరినీ ఆకట్టుకుంటుందని సమాచారం. ఈ సినిమా సీడెడ్ హక్కులు పదికోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మహేష్ బాబు సినిమా సీడెడ్‌లో ఈ స్థాయిలో అమ్ముడవడం ఇదే ప్రధమం.
 
అలాగే ఓవర్సీస్ రైట్స్ కూడా బ్రహ్మోత్సవం చిత్రానికి దాదాపు 13.20 కోట్ల రూపాయలు వచ్చాయట. ఈ ఓవర్సీస్ రైట్స్‌ని శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారు 13.20 కోట్ల భారీ రేటుకు దక్కించుకున్నారట. మంచి కుటుంబకథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథలో ఆకట్టుకునే భావోద్వేగాలను మిళితం చేసినట్టు సమాచారం. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు.