ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?
ఎప్పుడూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక మూలన అభివృద్ధి కార్యక్రమం చేస్తూనో లేదంటే కార్యాలయంలో పనుల సమీక్షలతో క్షణం తీరిక లేకుండా కనిపించే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనారోగ్యం బారిన పడ్డట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. దీనితో వైద్యులు ఆయనను విశ్రాంతి తీసుకోవాలని సూచన చేసినట్లు సమాచారం.
స్పాండిలైటిస్ అంటే ఏమిటి?
స్పాండిలైటిస్ వ్యాధి వల్ల పక్కటెముకలు, భుజాలు, మోకాలు లేదా పాదాలు వంటి ఇతర కీళ్లలో నొప్పి, దృఢత్వం, వాపు కనిపిస్తుంది. పక్కటెముకలను కలిపే కీళ్ళు ప్రభావితమైతే లోతైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఈ వ్యాధి కారణంగా దృష్టి మార్పులు తలెత్తవచ్చు. చాలా అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం కలుగుతుంది. సోరియాసిస్ వంటి చర్మ దద్దుర్లు రావచ్చు. కడుపు నొప్పితో పాటు జీర్ణ సమస్యలు కలగవచ్చు.