శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (14:15 IST)

జవాన్ ఓ బ్లాక్‌బస్టర్ మూవీ : మహేశ్ బాబు రివ్యూ

mahesh new look
కోలీవుడ్ దర్శకుడు అట్లీ - బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "జవాన్". గురువారం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఈ చిత్రాన్ని చూసిన మహేశ్ బాబు... తన ట్విట్టర్ ఖాతాలో షార్ట్ రివ్యూ రాశారు. జవాన్ బ్లాక్ బస్టర్ మూవీగా అభివర్ణించారు. గురువారం విడుదలైన ఈ చిత్రం తొలి రోజే ఏకంగా రూ.150 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు రాసిన రివ్యూను పరిశీలిస్తే, 
 
"జవాన్.. ఓ బ్లాక్ బస్టర్ మూవీ. కింగ్ నుంచి కింగ్ సైజ్ వినోదం. షారూక్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం. ప్రకాశం, తేజస్సు, స్క్రీన్‌పై కనిపించిన తీరు ఎంతో ప్రత్యేకం. జవాన్ షారూక్ సొంత రికార్డులనే బ్రేక్ చేస్తుంది. ఎంతో కూల్‌.. దిగ్గజాల నుంచి స్టఫ్" అంటూ మహేశ్ బాబు తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సినిమాలో షారూక్ ఖాన్ రెండు పాత్రలను పోషించారు. నయనతార, దీపికా పదుకొణెలు హీరోయిన్లుగా నటించారు. ప్రియమణి కీలక పాత్రను పోషించారు.