సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (14:01 IST)

మహేష్ బాబు శ్రీమంతుడు యూట్యూబ్‌లో రికార్డ్ సృష్టించింది

Mahesh babu -srimanthudu
Mahesh babu -srimanthudu
సూపర్ స్టార్ మహేష్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీమంతుడు’ 8 సంవత్సరాల క్రితం 2015లో విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద నాన్-బాహుబలి హిట్‌గా నిలిచింది.
 
శ్రీమంతుడు ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్‌లో 200 M+ వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. యూట్యూబ్‌లో హయ్యస్ట్ వ్యూస్ తో పాటు అత్యధికంగా ఇష్టపడిన తెలుగు చిత్రంగా నిలిచింది.
 
శ్రీమంతుడు గ్రామ దత్తత నేపధ్యంలో అలరించిన చిత్రం. తండ్రి జన్మించిన గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆదర్శవంతమైన యువకుడి కథ. ఈ సినిమా గ్రామాల ప్రాముఖ్యతను, మానవీయ విలువలను నేర్పుతుంది.
 
మైత్రీ మూవీ మేకర్స్‌కు తొలి ప్రొడక్షన్ వెంచర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మంచి సినిమాలతో టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్నారు.
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి చాలా అవార్డులు వచ్చాయి.