సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (18:27 IST)

రాజమౌళి మరోసారి తండ్రి అయ్యాడు! కారణం ఏమంటే!

Rama- Rajamouli
Rama- Rajamouli
దర్శకుల్లో టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి అంటే ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఒకరు.  పాన్‌ వరల్డ్‌ స్థాయిని తెలుగు సినిమాకు ఆపాదించిన ఆయన తాజాగా మహేష్‌బాబు కథానాయకుడిగా సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఇందుకు కథను సిద్ధం చేశారు. ప్రీప్రొడక్షన్‌ జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్‌పైకి ఎక్కనుంది. అయితే తాజాగా రాజమౌళి తండ్రి కాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇప్పటికే వారికి కార్తికేయ అనే అబ్బాయివున్నాడు. తను తన భార్య రమాదేవికి మొదటి భర్త ద్వారా పుట్టినవాడు. కొన్ని కారణాలవల్ల రమా మొదటి భర్తతో విడిపోయింది. ఆతర్వాత రాఘవేంద్రరావుగారి దగ్గర పనిచేస్తుండగా ఏర్పడిన సాన్నిహిత్యం వివాహం వరకు వెళ్ళింది. రమా అత్యంత మేథావి. పురాణాల్లో దిట్ట. కాస్టూమ్స్‌ డిజైనర్‌గా పేరుపొందింది. ఇదిలా వుండగా, రాజమౌళికి సేవాకార్యక్రమాలు చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అనాథలను ఆదుకుంటు వుంటాడు. అందులో భాగంగా చాలాకాలంక్రితం మాయక అనే అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. తాజాగా మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకుని మరోసారి తండ్రి కాబోతున్నాడని వార్త హల్‌చల్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో పలువురు దీనిపై పలురకాలుగా స్పందిస్తున్నారు. గతంలో అనుకున్నట్లు ఇద్దరు అనాథలను దత్తత తీసుకోవాలనుకున్న రాజమౌళి ఆ ప్రకారమే ఈసారి రెండో పాపను దత్తత తీసుకున్నాడని అంటున్నారు.