రియల్ లైఫ్‌లోనూ శ్రీమంతుడు.. మహేష్ బాబు సూపర్ స్టార్ అనిపించుకున్నాడు..!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నిజజీవితంలో శ్రీమంతుడని నిరూపించాడు. గ్రామదత్తతను రియల్ లైఫ్‌లోనూ చూపించి సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం అనే గ్రామాన్ని దత్తత త
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నిజజీవితంలో శ్రీమంతుడని నిరూపించాడు. గ్రామదత్తతను రియల్ లైఫ్‌లోనూ చూపించి సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఈ గ్రామాన్ని సందర్శించిన మహేష్, ఆ గ్రామానికి ఏది అవసరమో తెలుసుకొని వాటిని సమకూర్చే పని మొదలు పెట్టాడు. వైద్య ఆరోగ్య సర్వే ద్వారా ప్రతి ఇంటికెళ్లి, అనారోగ్య సమస్యల గురించి తెలుసుకొనే పని చేశాడు.
తాజాగా గ్రామంలో రోడ్లకు పక్కగా నిర్మించిన డ్రైనేజ్ వర్క్ కూడా పూర్తైంది. రోడ్లు, ప్రతి ఇంటికి నల్ల, గ్రామంలో గ్రంథాలయం మొదలగు పనులు కూడా చక చక నడుస్తున్నాయి. ప్రస్తుతం చేప్పట్టిన పనులు పూర్తి కావడంతో అభిమానులు ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తున్నారు. ఈ పనులన్నీ దగ్గరుండి గల్లా జయదేవ్‌తో పాటు మహేష్ అభిమానులు చూసుకుంటూ, ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలను మహేష్ బాబుకు తెలియజేస్తున్నారు.