శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2017 (17:58 IST)

మహేష్ బాబు-మురుగదాస్ సినిమా.. లుక్ రిలీజ్.. అందగాడు మరింత అందంగా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- తమిళ దర్శకుడు మురుగదాస్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలాకాలం అయినా.. ఇప్పటిదాకా మహేష్ లుక్ విడుదల కాలేదు.

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- తమిళ దర్శకుడు మురుగదాస్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలాకాలం అయినా.. ఇప్పటిదాకా  మహేష్ లుక్ విడుదల కాలేదు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో రిలీజైంది. ఈ లుక్‌లో మహేష్ మరింత అందంగా కనిపిస్తున్నాడు. చేతికి తెల్లాటి క్లౌజ్ తొడుక్కుని..  స్పైడర్ మ్యాన్‌లా కనిపిస్తున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో విడుదలవుతాయని సినీ యూనిట్ చెప్తోంది. 
 
కాగా.. అప్పుడెప్పుడో బ్ర‌హ్మోత్స‌వం సినిమా రిలీజ్ త‌రువాత నెల‌రోజుల త‌రువాత మురుగ‌దాస్ సినిమా స్టార్ట్ అయ్యింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టికి వరకు సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మురుగ‌దాస్ ఎప్పుడు లేనంత‌గా సినిమాను చెక్కుతున్నాడు. 
 
ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. డయ్యూలో కొన్ని ఫైటింగ్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సీఎం రోల్‌లో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. తమిళంలో ఇది మహేష్‌కు డబ్బింగ్ కాకుండా స్ట్రైట్ ఫిలిమ్ కావడంతో మురుగదాస్ అధిక శ్రద్ధ తీసుకుంటున్నారు.