శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 25 జనవరి 2017 (14:05 IST)

ఆమె నా అపురూప బహుమతి... మహేష్ బాబు ట్వీట్, రాజస్థాన్ మంత్రులుగా ముగ్గురు బాలికలు

నేడు జాతీయ బాలికల దినోత్సవం. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన కుమార్తె సితార గురించి ట్వీట్ చేశారు. తనకు తన కుమార్తె సితార అపురూపమైన బహుమతి అనీ, ఆమెను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉంటుందనీ, కుమార్తెలను కలిగిన ప్రతివారూ ఇలాగే గర్వంగా ఉంటారని ట్

నేడు జాతీయ బాలికల దినోత్సవం. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన కుమార్తె సితార గురించి ట్వీట్ చేశారు. తనకు తన కుమార్తె సితార అపురూపమైన బహుమతి అనీ, ఆమెను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉంటుందనీ, కుమార్తెలను కలిగిన ప్రతివారూ ఇలాగే గర్వంగా ఉంటారని ట్వీట్లో పేర్కొన్నారు.
 
జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ లో ముగ్గురు బాలికలు ఒకరోజు మంత్రులుగా ప్రమాణం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు మంత్రులుగా ఈ రోజు ప్రమాణం చేసిన ఈ బాలికలు, అధికారం తమ చేతుల్లోకి రాగానే తొలుత అంగన్వాడీ వర్కర్లకు 10,500 సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. అలాగే 282 మంది మహిళలకు ఐ-పాడ్లను అందించారు. 
 
ఆ తర్వాత మాట్లాడుతూ... అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని చెప్పారు. అమ్మాయిలకు అవకాశాలిస్తే ఎంతటి ఎత్తుకైనా ఎదుగుతారని వారు అన్నారు. ఒకరోజు మంత్రులుగా వారు ఈ రోజు మొత్తం వ్యవహరించనున్నారు.