శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మురళీకృష్ణ
Last Modified: శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (22:38 IST)

దుబాయ్ పోలీస్ స్టేషన్ నుంచి మహేష్ బాబు వీడియో

సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్స్ యంగ్ గా కనబడుతున్నాయి. కాగా చిత్రం గురించి ప్రతిరోజూ ఏదో ఒకటి లీక్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు మరో లీక్ బయటకు వచ్చింది. అదేంటయా అంటే.. దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు. 
 
దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్‌కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వెళ్లారట. స‌ర్కారు వారి పాట షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నారు మహేశ్ బాబు. ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుగుతుంది.
 
ఈ షెడ్యూల్‌లో మ‌హేష్‌, కీర్తి సురేష్‌ల‌పై సాంగ్స్‌తో పాటు కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు టాక్. అయితే కొద్ది రోజులుగా దుబాయ్‌లోని ప‌లు ప్రాంతాల‌ను త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ వ‌స్తున్న మ‌హేష్ తాజాగా దుబాయ్ పోలీస్ స్టేష‌న్‌ను చూపించారు.
 
లా మెర్‌లోని దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ (ఎస్పీఎస్)ను సందర్శించారు మ‌హేష్ బాబు. లా మెర్ స్టేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్, ఇది మ‌నుషుల‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌ల‌కు సేవ‌ల‌ను అందిస్తుంటుంది. స్టేష‌న్‌ను సంద‌ర్శించిన అనంత‌రం వీడియో విడుద‌ల చేసిన మ‌హేష్ ఈ టెక్నాల‌జీను చూసి మురిసిపోయాను. ఇలాంటిది గ‌తంలో ఎప్పుడు చూడ‌లేదు. ప్ర‌పంచంలోనే ఇది మొద‌టిది. అద్భుత‌మైన అనుభ‌వం అని తెలిపారు.