సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (09:39 IST)

రవితేజకు అండగా నాడు పవన్.. నేడు మహేష్.. ఎందుకు?

టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా పేరుగడించిన హీరో రవితేజ, ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో "ట్రిపుల్ ఏ (అమర్, అక్బర్, ఆంటోనీ)" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నెల 16వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేలా ప్లాన్ చేశారు. 
 
మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోవా బేబీ ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో శ్రీనువైట్ల ‌- ర‌వితేజ కాంబినేష‌న్‌లో వచ్చిన 'నీ కోసం', 'వెంకీ', 'దుబాయ్‌ శీను' వంటి చిత్రాలు వచ్చాయి. ఇవి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇపుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'అమర్ అక్బర్ ఆంటోని' . ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ వేడుకను ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. 
 
ఈ ఈవెంట్‌కి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నాడ‌ని అంటున్నారు. మ‌హేష్‌- శ్రీను వైట్ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన "దూకుడు" చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అలానే మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌లో మ‌హేష్ హీరోగా రూపొందిన "శ్రీమంతుడు" భారీ విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్‌కి శ్రీను వైట్ల‌తో, మైత్రి సంస్థ‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మహేష్ రానున్నారు. ర‌వితేజ చివ‌రి చిత్రం "నేల టిక్కెట్టు'కి ప‌వ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌రు కాగా, ఇప్పుడు మ‌హేష్ హాజ‌రుకానుండ‌టం గ‌మ‌న‌ర్హం.