మహేష్ ఖాతాలో మరో బిగ్ డీల్.. యాప్ టీవీ బ్రాండ్ అంబాసిడర్‌గా...
ప్రిన్స్ మహేష్ బాబు భారతదేశంలోని చాలా ముఖ్యమైన బ్రాండ్‌లకు అంబాసడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు… ఇదొక పేరు కాదు… ఇట్స్ ఏ బ్రాండ్… అన్న టాక్ ఇప్పటికే కార్పొరేట్ రంగంలో నెలకొంది.
ప్రిన్స్ మహేష్ బాబు భారతదేశంలోని చాలా ముఖ్యమైన బ్రాండ్‌లకు అంబాసడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు… ఇదొక పేరు కాదు… ఇట్స్ ఏ బ్రాండ్… అన్న టాక్ ఇప్పటికే కార్పొరేట్ రంగంలో నెలకొంది. ఇప్పటివరకు మామూలు మార్కెట్ కు మాత్రమే పరిమితమైన మహేష్ పేరు, ప్రస్తుతం ఆన్‌లైన్ ప్రపంచాన్ని కూడా ఊపేసే దిశగా వెళుతుంది. ఆన్‌లైన్ చానల్స్ ప్రొవైడర్లలో అగ్రగామిగా దూసుకు వెళ్తున్న యప్ టీవీకి సూపర్‌స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.
నేడు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జరుగనున్న కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. పదమూడు భాషలు.. సుమారు 900లకు పైగా ఇండియన్ టీవీ చానళ్లు.. లైవ్ టీవీ ఎనీటైమ్ ఎనీవేర్ స్లోగన్‌తో స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్.. ఇలా ఇంటర్నెట్ వీక్షకులకు లైవ్ టీవీ చూసే అవకాశం కల్పిస్తోంది యప్ టీవీ. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆన్ లైన్ బస్సుల బుకింగ్స్ వెబ్ సైట్ ''అబిబస్.కాం'' కోసం మహేష్ బాబుపై ఓ యాడ్ చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఛానల్ లోగోను మహేష్ ఆవిష్కరించారు. యుప్ టీవీ కుటుంబంలోకి వచ్చి అనుబంధం పెంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్న మహేష్ బాబు... భవిష్యత్తులో వినోదం అంతా ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ రంగంలోనే ఉంటుందని చెప్పారు.
దక్షిణాసియా కంటెంట్ వీడియోలను ప్రపంచం నలుమూలల నుంచి చూడాలనుకునేవారినందరనీ... యప్ టీవీ చేరువ చేసిందని అంటున్నారు. పైరసీని కూడా దీనిద్వారా పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. షూటింగ్ లేనప్పుడు తనకు టీవీతోనే అధికంగా కాలక్షేపం అవుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా మహేష్ తెలిపారు. పలు కంపెనీలు తనను ప్రచార కర్తగా చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.