గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 29 జూన్ 2017 (15:19 IST)

దిలీప్‌కు వార్నింగ్: పల్సర్ సునీ నాకు ఫ్రెండా? నోరు విప్పితే డేంజర్..

కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన నటి మలయాళ స్టార్ దిలీప్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నటిని కారులో అపహరించి, వీడియోలు తీసిన ఘటనలో నటుడు దిలీప్ హస్తం ఉంటుందని దక్షిణాది సినీ పరిశ్రమ అనుమానాలు వ్యక్తం చేసింది. కానీ దిలీప్ మాత్రం తనకేమ

కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన నటి మలయాళ స్టార్ దిలీప్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నటిని 
కారులో అపహరించి, వీడియోలు తీసిన ఘటనలో నటుడు దిలీప్ హస్తం ఉంటుందని దక్షిణాది సినీ పరిశ్రమ అనుమానాలు వ్యక్తం చేసింది. కానీ దిలీప్ మాత్రం తనకేమీ తెలియదన్నట్లు వ్యవహరించాడు. అంతేగాకుండా వివరణ కూడా ఇచ్చాడు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. 
 
పనిలో పనిగా నటి వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు జైల్లో ఉన్న పల్సర్ సునీ గురించి దిలీప్ కొన్ని విషయాలు తెలిపాడు. పల్సర్ సునీ తనను జైలు నుంచి బెదిరిస్తున్నాడని దిలీప్ గతవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా సునీ కిడ్నాప్ బాధిత నటికి మంచి స్నేహితుడన్నాడు. అందుకే స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. దిలీప్ వ్యాఖ్యలపై బాధిత నటి తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ, తాను స్నేహితులమని ఒక నటుడు చెప్పినట్టు తనకు తెలిసిందన్నాడు. ఆ వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని చెప్పుకొచ్చింది. ఇలాంటి అవాకులు, చవాకులు పేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించింది. తాను నోరువిప్పి మాట్లాడితే విచారణపై ప్రభావం చూపుతుందని పోలీసులు సూచించడంతో మౌనంగా ఉన్నానని, తన మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దని దిలీప్‌కు బాధిత నటి వార్నింగ్ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.