1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (12:55 IST)

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఇకలేరు..

Mammootty
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ మృతి చెందడంతో మాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. మలయాళ ప్రముఖ నటులలో మమ్ముట్టి ఒకరు. ఆయన తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ శనివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. వయోభారం కారణంగానే ఆమె మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
శనివారం సాయంత్రం ఫాతిమా ఇస్మాయిల్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే, ఫాతిమా ఇస్మాయిల్ మరణం తర్వాత, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మమ్ముట్టి, అతని కుమారుడు దుల్కర్ సల్మాన్‌లకు వ్యక్తిగతంగా సంతాపం తెలియజేస్తున్నారు.