శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (09:10 IST)

మాలీవుడ్‌లో మరో విషాదం... కార్డియాక్ అరెస్టుతో నటి ప్రియ మృతి

tvactress priya
మలయాళ చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా నటి రెంజూష మీనన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే... మరో మలయాళ బుల్లితెర నటి డాక్టర్ ప్రియ (35) కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఎనిమిది నెలల గర్భవతి అయిన ఆమె... మంగళవారం రాత్రి చనిపోయారు. ఈ విషయాన్ని ఆమె సోదరుడు కిషోర్ సత్య వెల్లడించారు. 
 
'మలయాళీ టీవీ ఇండస్ట్రీలో ఊహించని విధంగా మరొకరు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ ప్రియ కన్నుమూశారు. ఆమె ఎనిమిది నెలల ప్రెగ్నెంట్. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రియ కార్డియాక్ అరెస్ట్‌కు గురై మరణించారు. అయితే, వైద్యులు తక్షణం స్పందించి శిశువును బయటకు తీశారు. ప్రస్తుతం శిశువు సురక్షితంగా ఉంది. చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబసబ్యుల ఆవేదన నన్నెంతో కలచివేసింది. వాళ్లను ఎలా ఓదార్చాలో నాకు అర్థంకాలేదు. మంచి వాళ్లకు భగవంతుడు ఇంతటి అన్యాయం ఎందుకు చేస్తాడో?' అంటూ ఆయన నెట్టింట పోస్ట్ పెట్టారు.
 
వైద్య విద్య చదువుకున్న ప్రియ సీరియల్ నటిగా మలయాళంలో టీవీ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. "కరుతముత్తు" అనే సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పెళ్లి తర్వాత ఆమె నటనకు దూరంగా ఉంటున్నారు.