శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (16:41 IST)

దేవర సెట్ లో జాన్వీ కపూర్‌ ను మెచ్చుకున్న ఎన్టీఆర్

Janvi at devara set
Janvi at devara set
ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం దేవర. షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఇక్కడ జాన్వీ కపూర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా "ఇదిగో మా తంగం" అంటూ జాన్వీ కపూర్ ఫోటోను 'దేవర' యూనిట్ షేర్ చేసింది. లేలేత పరువాల జాన్వీ చిరు నవ్వులు చిందిస్తూ చూడగానే ఇట్టే ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. 
 
షూటింగ్ లంచ్ గ్యాప్ తర్వాత దేవర టీమ్ ఒక స్టిల్ ను తాజాగా పోస్ట్ చేసింది. జాన్వీ కపూర్‌, ఎన్టీఆర్ చేయి పట్టుకుని మాట్లాడుతుండగా దర్శకుడు కొరటాల శివ కూడా ఆసక్తిగా వింటున్నారు. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతోంది. యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ సిబ్బందితో చిత్రీకరిస్తున్నారు. సముద్ర దొంగల నేపథ్యంలో కథ వుంటుంది. హాలీవుడ్ పైరేటెడ్ సినిమా తరహాకు మించి వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.