సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (00:04 IST)

శ్రీదేవిని తలపించేలా జాన్వీ లుక్.. దేవరలో తంగం ఈమె!

Jhanvi Kapoor
Jhanvi Kapoor
అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ ఎన్టీఆర్- కొరటాల శివ, దేవరలతో సినిమాలో సైన్ చేసి తెలుగు అభిమానులను ఉత్తేజపరిచింది. దేవరలో ఆమె ఫస్ట్ లుక్ చాలా కాలం క్రితం విడుదలైంది. అయితే తాజాగా శ్రీదేవిని తలపించేలా జాన్వీ లుక్ దేవర సెట్ నుంచి విడుదలైంది. 
 
జాన్వీ కపూర్ విలేజ్ గర్ల్ లుక్‌లో ఉన్న తన చిత్రాన్ని పోస్ట్ చేసి, 'మిస్సింగ్ సెట్- టీమ్..తంగం #దేవర' అని రాసింది. బీచ్‌లలో సాంగ్ షూట్ కోసం జాన్వీ కపూర్ త్వరలో గోవాలోని దేవర సెట్స్‌లో జాయిన్ కానుందని వినికిడి. 
 
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర రెండు భాగాలుగా విడుదల చేయబడుతుంది. మొదటి భాగం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది.