శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (10:09 IST)

ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లోని 'ఐరెనే వంచాలా ఏంటి..?' డైలాగ్

Family star poster
Family star poster
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "ఫ్యామిలీ స్టార్". మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా టైటిల్, గ్లింప్స్ రిలీజ్  చేశారు. ఈ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని సినిమా సక్సెస్ గ్యారెంటీ అనే నమ్మకాన్ని కలిగించింది. అటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎలిమెంట్స్, యాక్షన్, హీరోయిజం అన్నీ సినిమాలో ప్యాకేజ్ గా ఉన్నట్లు "ఫ్యామిలీ స్టార్" గ్లింప్స్ తో తెలిసింది. ఇక ఈ గ్లింప్స్ లోని 'ఐరెనే వంచాలా ఏంటి..?' డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్ లో ఈ డైలాగ్ వైరల్ అవుతోంది.

ఈ ట్రెండింగ్ చూసి అసలు 'ఇంటర్నెట్ లో ఏం నడుస్తుంది...?' అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు విజయ్. 'ఐరెనే వంచాలా ఏంటి...?' డైలాగ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విజయ్ దారినే నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ ఫాలో అయ్యింది. 'మేము కూడా ఈ మ్యాడ్ నెస్ లో భాగమవుతున్నాం..' అంటూ 'ఐరెనే వంచాలా ఏంటి...?' డైలాగ్ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా కొందరు నెగిటివ్ గా ట్రోల్స్ చేసినా దాన్ని కూడా విజయ్ దేవరకొండ పాజిటివ్ గా తీసుకున్నారు. ఈ డైలాగ్ వైరల్ అవుతుండటంతో 'ఐరెనే వంచాలా ఏంటి...?' అనే స్పెషల్ పోస్టర్ చేయించి రిలీజ్ చేశారు మేకర్స్.

"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.