సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (09:47 IST)

అచ్చం అమ్మలాగే.... అతిలోక సుందరిని మురిపిస్తున్న తనయ!

janhvi kapoor
భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా గుర్తింపు పొందిన అందాల నటి దివంగత శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్.. ఇపుడు అచ్చం అమ్మను తీసిపెట్టింది. ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో జాన్వీ కపూర్ అచ్చం తన తల్లి శ్రీదేవిలా కనిపిస్తున్నారు. ఈ ఫోటోను "దేవర" యూనిట్ షేర్ చేసింది. 
 
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఇక్కడ జాన్వీ కపూర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా "ఇదిగో మా తంగం" అంటూ జాన్వీ కపూర్ ఫోటోను 'దేవర' యూనిట్ షేర్ చేసింది. లేలేత పరువాల జాన్వీ చిరు నవ్వులు చిందిస్తూ చూడగానే ఇట్టే ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పోషిస్తున్న పాత్ర పేరు 'తంగం'. అందుకే ఇదిగో మా తంగం అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ జోడించింది. మరోవైపు, ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. 'దేవర' చిత్రానికి కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవించంద్రన్ సంగీతం అందిస్తున్నారు.