గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (11:42 IST)

మూవీ ఛాన్స్ కావాలంటే టాప్ పేకిలేపి చూపించు... 65 యేళ్ళ నిర్మాత

బాలీవుడ్ సినీ ఛాన్సుల కోసం చాలా మంది వర్థమాన నటీమణులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటివారిలో మల్హార్ రాథోడ్ ఒకరు. ఈమె అవకాశాల కోసం పలువురు నిర్మాతలను సంప్రదించారు. ఆ సమయంలో ఓ 65 నిర్మాత వద్ద తనకు ఎదురైన అనుభవాన్ని ఇపుడు పూసగుచ్చినట్టు వెల్లడించింది. సినీ అవకాశం కావాలంటే టాప్ పైకి చూపించాలని కోరాడని చెప్పుకొచ్చింది. 
 
చిత్రపరిశ్రమ వెనుక జరుగుతున్న వ్యవహారాలపై పలువురు నటీమణులు ఇటీవలి కాలంలో మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. ముఖ్యంగా, తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వారు బహిర్గతం చేశారు. దీంతో మీటూ ఉద్యమం ఓ స్థాయికి వెళ్లింది. ఈ ఉద్యమంలో భాగంగా అనేక మంది నటీమణులు తమ అనుభవాలను వెల్లడించారు. 
 
తాజాగా మల్హార్ రాథోడ్ తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టింది. 65 ఏళ్ల నిర్మాత ఒకరు తనకు అవకాశాలు కావాలంటే టాప్ పైకి లేపాలని కోరాడని, ఆ మాట విన్న వెంటనే తనకు విపరీతమైన భయం వేసిందని, షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టిందని గుర్తు చేసుకుంది. ప్రస్తుతం వర్ధమాన టీవీ తారల్లో ఒకరుగా మల్హోత్రా ఉన్నారు. 
 
తాజాగా, తనకూ అటువంటి ఘటనే ఎదురైందని మల్హోత్రా పేర్కొనడం మరోమారు చర్చనీయాంశమైంది. ఆయన అలా అడిగే సరికి తొలుత ఏం చేయాలో తనకు అర్థం కాలేదని నటి పేర్కొంది. ఈ అనుభవం తర్వాత బాలీవుడ్ వైపు తాను కన్నెత్తి కూడా చూడలేదని నటి వాపోయింది.