శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (10:58 IST)

మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు" టాక్ ఎలా ఉందంటే..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రదర్శించగా, సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇపుడు స్వదేశంలో విడుదలైంది. శనివారం ఉదయం ప్రత్యేకషోను తిలకించిన అభిమానులు... మహేశ్‌బాబును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గతంలో వచ్చిన మహేష్ బాబు చిత్రాలకు భిన్నంగా సూపర్‌గా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
 
అంతేకాకుండా, ఈ చిత్రంలో మహేష్ బాబు అటు డ్యాన్సులు, కామెడీని ఇరగదీశాడని అంటున్నారు. నిజానికి దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీని పండించడంలో సూపర్. ఎఫ్-2 చిత్రంలో అతని కామెడీ మార్కును చూశారు. ఇపుడు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా అనిల్ రావిపూడి అదే తరహా కామెడీతో ముందుకు వచ్చి సక్సెస్ అయ్యారని ప్రేక్షకులు అంటున్నారు. 
 
ఇకపోతే, దాదాపు పదమూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి తన పాత్రకు న్యాయం చేశారని ప్రేక్షకులు అంటున్నారు. అనిల్ రావిపూడి మొదటి నుంచి చెబుతున్నట్టుగా ఈ సినిమాకు ట్రైన్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచిందట. ఈ సీన్ స్టార్టింగ్ టూ ఎండింగ్ ప్రేక్షకులు పడిపడి నవ్వులే నవ్వులని టాక్. 
 
మొత్తం మీద.. పేరుకు తగ్గట్టుగానే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో మహేశ్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలావుంటే... 'అల వైకుంఠపురంలో' చిత్రంపై బన్నీ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. జనవరి 12న 'అల వైకుంఠపురంలో..' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.