తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మి లేఖ, అందులో ఏమున్నదంటే?
బాలబాలికల విద్య కోసం నటి మంచులక్ష్మి తన వంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం నిపుణులైన అధ్యాపకులతో విద్యార్థినీవిద్యార్థులకు బోధనా తరగతులను కూడా నిర్వహిస్తుంటారు లక్ష్మి.
ఇక అసలు విషయానికి వస్తే... తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమం అద్భుతంగా వుందంటూ కితాబు ఇచ్చారు మంచు లక్ష్మి. దీనికితోడు డిజిటల్ ఎడ్యుకేషన్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా జతచేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తను సిద్ధంగా వున్నట్లు తెలిపింది.