గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (12:09 IST)

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

ప్రభుత్వం ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోుగలందరికీ కరువు భత్యం (డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని 10.01 శాతంగా పెంచింది. 
 
ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పింఛన్‌దారాలకు కూడా కూడా వర్తిస్తుంది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలకు సంబంధించి ఉత్తర్వులు ఆర్థిక శాఖ బుధవారం రాత్రి జారీచేసింది.
 
దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనం (బేసిక్ పే)లో 7.8 శాతంగా ఉండే డీఏ 17.29 శాతంగా పెరుగనుంది. ఈ పెరిగిన డీఏ పెంపు వర్తింపు 2021 జూలై నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.