'గుంటూరోడు' ప్రేమకథ.. త్వరలో టీజర్ రిలీజ్..
మంచు మనోజ్ 'గుంటూరోడు' సినిమాతో రాబోతున్నాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. సోషల్ మీడియా ద్వారా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాడు. 'భూమి మీద దేవతలు తి
మంచు మనోజ్ 'గుంటూరోడు' సినిమాతో రాబోతున్నాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. సోషల్ మీడియా ద్వారా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాడు. 'భూమి మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు తప్పవు బావా'.. అనే డైలాగ్‌తో రూపొందిన ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకునేలా వుంది.
ప్రేమను గెలిపించడానికి పోరాడే ఒక యువకుడి కథగా ఈ సినిమా రూపొందింది. వరుణ్ అట్లూరి నిర్మాణంలో సత్య తెరకెక్కించిన ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ రానుంది. సాధ్యమైనంత త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు.