శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (17:02 IST)

26న ''గుంటూరోడు'' ఆడియో విడుద‌ల‌

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మంచు మ‌నోజ్ హీరోగా, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, ఎస్కే. సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్తి చేసుకుని ఆడియో

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మంచు మ‌నోజ్ హీరోగా, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, ఎస్కే. సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్తి చేసుకుని ఆడియో విడుద‌ల‌కు ముస్తాబైంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంది. మ‌నోజ్ గ‌త చిత్రాలను మైమ‌రింపచేసేలా, ఈ మాస్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటుంది. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత వ‌రుణ్ అట్లూరి మాట్లాడుతూ... లవ్ అండ్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న మా గుంటూరోడు చిత్ర ఆడియో ఈ నెల 26న జ‌ర‌గ‌నుంది. శ్రీ వ‌సంత్ అందించిన బాణీలు అంద‌రినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మ‌నోజ్ ఈ చిత్రంలో త‌న యాక్ష‌న్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు. 
 
మ‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్, ఎక్సే.సత్యల‌తో స‌హా యూనిట్ అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. జ‌న‌వ‌రి 26న ఆడియో విడుద‌ల చేసి, ఫిబ్ర‌వ‌రిలో సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.