వామ్మో.. అవికాగోర్ ప్రేమలో పడిందట.. ముంబై సెలబ్రిటీతో డేటింగ్!
ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, లక్ష్మీ రావే మా ఇంటికి వంటి సినిమాలు వరుసగా హిట్ కావడంతో అవికా గోర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తదుపరి సినిమాకు స్క్రిప్ట్ వినడంలో అప్పుడే అవికాగోర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. సినిమా చూపిస్త మావ హిట్ కావడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆఫర్లిచ్చేందుకు ఎగబడుతున్నా.. స్క్రిప్ట్‌లు వింటూ రకరకాల కామెంట్లు చేస్తూ తెగ విసిగిస్తోందని టాక్.
దర్శక నిర్మాతలకు చుక్కలు చూపించడంతో పాటు అవికా గోర్ ప్రస్తుతం ప్రేమలో పడిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ముంబైకి చెందిన ఒక సెలెబ్రెటీతో ఆమె డేటింగ్ చేస్తోందంటూ బాలీవుడ్ మీడియా జోరుగా ప్రచారం చేస్తోంది. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు ముందు హిందీలో సీరియల్స్ చేసిన అవికా గోర్, ప్రస్తుతం సినిమాల్లో గుర్తింపు రావడంతో తిరుగులేదనుకుంటోంది.
తాజాగా ఓ టీవీషోలో పరిచయమైన మనీష్ రాయ్ సంగన్ అనే కోయాంకర్‌తో అవికా ప్రస్తుతం లవ్వాయణం సాగిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరూ కలిసి ఓ టీవీషోలో యాంకర్లుగా వ్యవహరించడం గమనార్హం. వారిద్దరిది బుల్లితెరపై బెస్ట్ పెయిర్ అన్న కామెంట్స్‌తో పాటు వీరి కెమిస్ట్రీ బాగా పండిందని కామెంట్స్ కూడా వచ్చాయి.