మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (12:17 IST)

త్రిష, ఖుష్బూ, చిరంజీవిపై పరువు నష్టం కేసు.. హీరోయిన్లతో పార్టీ?

mansoor alikhan
గత కొన్ని రోజులుగా తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తున్నారు. తన లియో సహనటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్సూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్స్ (NCW) జోక్యంతో తమిళనాడు పోలీసులు మన్సూర్‌పై కేసు నమోదు చేసిన కొన్ని రోజుల తర్వాత, సీనియర్ నటుడు త్రిషకు క్షమాపణలు చెప్పాడు. త్రిష కూడా క్షమించింది. 
 
అయితే తాజాగా త్రిష, మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి ఖుష్బూపై పరువు నష్టం కేసులను దాఖలు చేయనున్నట్లు మన్సూర్ ప్రకటించారు. ఈ ముగ్గురు నటులపై 10 రోజుల పాటు పరువు నష్టం, ప్రజా శాంతికి భంగం కలిగించడం, సివిల్- క్రిమినల్, తనపై ముందస్తు ప్రణాళికతో అల్లర్లు వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేస్తానని మన్సూర్ చెప్పారు.
 
మెగాస్టార్ చిరంజీవి ప్రతి ఏడాది హీరోయిన్లతో పార్టీ చేసుకుంటాడని.. అలాంటి వ్యక్తి తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మన్సూర్ మండిపడ్డాడు.
 
ప్రచారంలో ఉన్న వీడియో కల్పితమని, కేసు నమోదు చేసేటప్పుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అసలు వీడియో, ఇతర సాక్ష్యాలను సమర్పిస్తానని మన్సూర్ పునరుద్ఘాటించారు. చిరు, ఖుష్బూ, దేశవ్యాప్తంగా అనేక మంది ఇతర సినీ ప్రముఖులు,  అభిమానులతో పాటు, మొత్తం ఎపిసోడ్‌లో మన్సూర్‌పై విరుచుకుపడి త్రిషకు తమ సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.