బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (16:34 IST)

మన్సూర్ అలీ ఖాన్ సారీ.. స్పందించిన త్రిష.. ఏమన్నదో తెలుసా?

Trisha neckles
సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలపడంపై హీరోయిన్ త్రిష స్పందించారు. తప్పు చేయడం మానవ సహజనమని.. దాన్ని మన్నించడం దైవ గుణమని అన్నారు. దీంతో ఈ వివాదానికి త్రిష కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు. 
 
కాగా త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. లియో సినిమాలో త్రిష నటిస్తుందనగా.. అందులో ఆమెతో తనకు రేప్ సీన్ వుంటుందని తాను భావించానని.. కానీ ఆ సీన్ లేకపోవడంతో తాను చాలా నిరాశకు గురయ్యానని మన్సూర్ తెలిపాడు. 
 
ఈ వ్యాఖ్యలపై సెలెబ్రిటీలు ఫైర్ అయ్యారు. ఈ అసభ్యకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా కేసు కూడా నమోదైంది. దీంతో మన్సూర్ త్రిష వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు.