1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (17:46 IST)

త్రిషకు సారీ చెప్పిన మన్సూర్.. మంగళసూత్రం ఇచ్చి..?

trisha krishnan
ఎట్టకేలకు నటి త్రిషకు నటుడు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు తెలిపాడు. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని, "లియో"లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నానని మాత్రమే చెప్పానని మన్సూర్ తెలిపాడు. 
 
త్రిషపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని, తాను సరదాగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపాడు. ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఆయన త్రిషకు క్షమాపణలు చెబుతూ పెట్టిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 
 
కాగా మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. దీనిపై సెలెబ్రిటీలు ఫైర్ అయ్యారు. దీంతో తాను తప్పుగా మాట్లాడలేదని మన్సూర్ చెప్పాడు. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని అన్నాడు. అయితే ఈ వివాదానికి తన సారీతో ఫుల్ స్టాప్ పెట్టేశాడు.