మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (15:30 IST)

మధుర వైన్స్ నిర్మాత రాజేష్ కొండెపు భారీ చిత్రం

Rajesh Kondepu
వినూత్న‌మైన క‌థాంశంతో `మధుర వైన్స్` అనే చిత్రం నిర్మించి విడుద‌ల చేసిన రాజేష్ కొండెపు త్వ‌ర‌లో ఓ భారీ సినిమాను నిర్మించ‌బోతున్నారు. మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆర్.కె.సినీ టాకీస్ అధినేత రాజేష్ కొండెపు వారి బ్యానర్ లో 'మధుర వైన్స్' చిత్ర దర్శకుడు జయకిశోర్ బండి తో ప్రొడక్షన్ నెంబర్.2 త్వరలోనే ప్ర‌క‌టించ‌నున్నామ‌ని తెలిపారు.
 
ప్రేమ‌, యాక్ష‌న్ క‌థాంశాలుగా వైవిధ్య‌మైన క‌థాంశంతో ఈ చిత్రం వుండ‌బోతుంద‌ని తెలియ‌జేశారు. భారీ తారాగణంతో,అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని ఆయ‌న‌ చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని,మరిన్ని వివరాలు జనవరి నెలలో తెలియజేస్తాం అని వివరించారు.