ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (18:11 IST)

#మాయలో క్లీన్ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్- చిత్ర యూనిట్

Radha Krishna Nambu Megha Mithra Pervar Gnaneswari Naresh Agastya Bhavana Shalini Nambu
Radha Krishna Nambu Megha Mithra Pervar Gnaneswari Naresh Agastya Bhavana Shalini Nambu
హీరో నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి కాండ్రేగుల ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ '#మాయలో'. మేఘా మిత్ర పేర్వార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేం పిక్చర్స్ బ్యానర్ పై  షాలినినంబు, రాధా కృష్ణ నంబు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 15 విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.
 
నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. #మాయలో.. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ మనస్పూర్తిగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఇందులో ప్రతి సన్నివేశం హాయిగా నవ్వుకునేలా వుంటుంది. మేఘా రాసిన ప్రతి సన్నివేశం వండర్ ఫుల్ గా వుంటుంది.  భావన, జ్ఞానేశ్వరి అద్భుతంగా నటించారు. డెనిస్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డిసెంబర్ 15న సినిమా విడుదౌతుంది. తప్పకుండా మీరంతా ఆదరిస్తారని నమ్ముతున్నాను'' అన్నారు.
 
జ్ఞానేశ్వరి కాండ్రేగుల మాట్లాడుతూ.. '#మాయలో మంచి సినిమా. యూత్, కాలేజ్, ఫ్రండ్స్, లవర్స్..అందరూ  కనెక్ట్ అవుతారు. ఫీల్ గుడ్ మూవీ ఇది. నరేష్ తో ఇంతకుముందు సేనాపతి చిత్రం చేశాను. తను అద్భుతమైన నటుడు. భావన నుంచి చాలా నేర్చుకున్నాను. నిర్మాత శాలిని, ఆర్కే  చాలా సపోర్ట్ ఇచ్చారు. డైరెక్టర్ మేఘా చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ థియేటర్స్ లో చూడాలి' అని కోరారు
 
భావన మాట్లాడుతూ.. ఇది నా మొదటి ఫుల్ లెంత్ మూవీ. ఈ కథ చదువుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. చాలా లైట్ హార్ట్ మూవీ ఇది. యానిమల్ తర్వాత సలార్ ముందు.. ఇంత వైలెన్స్ చూసిన తర్వాత.. పువ్వులని, అమ్మాయిలని చూడాలనిపిస్తే (నవ్వుతూ) డిసెంబర్ 15న తప్పకుండా #మాయలో సినిమా చూడాలి' అని కోరారు.
 
దర్శకుడు మేఘా మిత్ర పేర్వార్  మాట్లాడుతూ.. చక్కని వినోదం, మనసుని హత్తుకునే భావోద్వేగాలు, మంచి పెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే మాటలు వుండే కథ ఇది. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను'' అన్నారు
 
నిర్మాత షాలిని నంబు మాట్లాడుతూ.. సోలో నిర్మాతగా ఇది నా మొదటి చిత్రం. మా బ్రదర్ తో కలసి సినిమా నిర్మించాను. చాలా ప్రేమతో ఈ సినిమా చేశాం. చాలా మంచి టీంతో వర్క్ చేశాం. అందరూ చక్కని ప్రతిభ కనపరిచారు. ఇది చాలా క్లీన్ ఫిలిం. మంచి ఎంటర్ టైనర్. తప్పకుండా మీ అందరికీ న్బచ్చుతుంది'' అన్నారు  
 
రాధా కృష్ణ నంబు మాట్లాడుతూ.. దర్శకుడు మేఘా చాలా చక్కని కథని ఇచ్చారు.వంశీ చక్కని విజువల్స్ ఇచ్చారు. డెనిస్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నరేష్ పాత్రని ముందే ఫిక్స్ అయిపోయాం. ఆయన ఈ పాత్రని అంగీకరించడం ఆనందంగా వుంది. భావన, జ్ఞానేశ్వరి చాలా చక్కగా నటించారు. ముగ్గురు చాలా అద్భుతంగా పెర్ఫార్ చేశారు'' అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మిగతా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.