గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (19:01 IST)

మెడిక‌ల్ క్రైం థ్రిల్లర్ గా అసురగణ రుద్ర తెరకెక్కుతోంది

Naresh Agastya, Sangeerthana Vipin
Naresh Agastya, Sangeerthana Vipin
నరేష్‌ అగస్త్య, సంగీర్తన విపిన్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మెడిక‌ల్ క్రైం థ్రిల్లర్ ‘అసురగణ రుద్ర’. మురళీ కాట్రాగడ్డ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రాన్ని కమ్జుల ప్రొడక్షన్స్‌ పతాకంపై మురళీ వంశీ నిర్మిస్తున్నారు.
 
తాజాగా ఈ చిత్రం నుంచి 'నీ కనులలో'  పాటని విడుదల చేశారు మేకర్స్. శేఖర్ చంద్ర ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించే బ్యూటీఫుల్ మెలోడి కంపోజ్ చేశారు. సిద్దార్థ్ మీనన్ లైవ్లీ గా పాడిన ఈ పాటకు నికేష్ కుమార్ దాసగ్రంధి ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ఈ పాటలో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ని చాలా ప్లజంట్ గా ప్రజెంట్ చేశారు.
 
మురళీ శ‌ర్మ, ఆమ‌ని, శ‌త్రు, అమిత్‌, అభిన‌య‌, దేవీ ఫ్రసాద్ లాంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి  శ్రీ‌కాంత్ ప‌ట్నాయ‌క్‌ ఎడిటర్.
 
నటీనటులు: న‌రేష్ అగ‌స్త్య, సంగీర్తన విపిన్‌, ఆర్యన్ రాజేష్, మురళీ శ‌ర్మ, ఆమ‌ని, శ‌త్రు, అమిత్‌, అభిన‌య‌, దేవీ ఫ్రసాద్ త‌దిత‌రులు